CapitaLand Announces ₹450 Crore Investment for a New IT Park in Hyderabad
Singapore-based CapitaLand to develop a 10 lakh sq. ft. IT park in Hyderabad with an investment of ₹450 crore.
సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మరో ముందడుగు వేసింది. హైదరాబాద్‌లో రూ. 450కోట్ల పెట్టుబడులతో అత్యాధునిక ఐటీ పార్క్ నిర్మాణానికి ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ క్యాపిటల్యాండ్ CapitaLand ముందుకొచ్చింది.
సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచస్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటైన క్యాపిటల్యాండ్ హైదరాబాద్ నగరంలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయనుంది.
ముఖ్యమంత్రి గారితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఉన్నతాధికారుల బృందం క్యాపిటల్యాండ్ ప్రతినిధులతో జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది.
ఈ చర్చల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గారు, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, సీఎంవో స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి గారు, క్యాపిటల్యాండ్ తరఫున ఇండియా ట్రస్ట్ మేనేజ్‌మెంట్ సీఈవో గౌరీ శంకర్ నాగభూషణం గారు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానీ గారు తదితరులు పాల్గొన్నారు.
ఈ కొత్త ఐటీ పార్క్ “హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుంది.” ఇది బ్లూ చిప్ సంస్థలకు కావలసిన ప్రీమియం సదుపాయాలను అందించనుంది.
CapitaLand ఇప్పటికే హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ (ITPH), అవాన్స్ హైదరాబాద్, సైబర్‌పెర్ల్ పార్కులు నిర్మిస్తోంది. సంస్థ 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ ఈ ఏడాది మధ్యలో సిద్ధం చేస్తుంది, మరియు ITPH రెండో దశ 2028 నాటికి పూర్తవుతుంది.