Invest Telangana

A $3 Trillion Vision

By 2047, Telangana aims to become a $3 trillion economy, fuelled by investment, innovation and inclusive growth.

Read the roadmap

Stay Informed

Explore the latest announcements and G.O.s, decisions, developments and moments shaping Telangana’s growth story.

Clearance is a right, not a favour

TG-iPASS gives every investor a statutory 15-day deadline. Miss it, and approval is deemed granted by law.

How the clock runs
Global Summit 2026 Contact
Contact Explore TG-iPASS
All press releases
Infrastructure

రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్‌పేట భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు భూమి పూజ నిర్వహించారు

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనం, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లకు ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్‌పేట భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు భూమి పూజ నిర్వహించారు. ఇదే సందర్భంగా గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ భవనానికి శంకుస్థాపన చేశారు. అలాగే, మల్కాజిగిరి కమిషనరేట్ భవనం, ఆక్టోపస్ పరిపాలనా బ్లాక్, కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయ భవనాలను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, జూపల్లి కృష్ణారావు గారు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, పలువురు ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గారు, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గారు ఇతర పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, అత్యంత అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించి ఇక్కడి సమస్యలు పరిష్కారం కావాలంటే సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలని, అప్పుడే అద్భుతమైన సిటీగా రాణించగలదని చెప్పారు.

“ఈ ప్రాంతం పెట్టుబడులకు అనుకూలమైన ప్రదేశమని, ఎక్కడైతే అభివృద్ధి చేసి ప్రపంచానికి చూపించాలని అనుకున్నామో అక్కడే నిర్వహించాలన్న ఉద్దేశంలో ఇక్కడ 3 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాం. ఇక్కడ పెట్టుబడుల కోసం ఎక్కడెక్కడో ఒప్పందాలు చేసుకోవడమేంటని, ముందుగా ఇక్కడ ఫ్యూచర్ సిటీ కార్యాలయం నిర్మిస్తున్నాం. జూన్ 2 వ తేదీ లోపే నిర్మాణం పూర్తి చేసుకుని ఆ భవనం నుంచి కార్యక్రమాలు చేపడుతాం” అని వివరించారు.

“శంషాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్ గా మారనుంది. బుల్లెట్ ట్రైన్స్‌కు తోడు ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలును అనుసంధానం చేయబోతున్నాం. బుల్లెట్ ట్రైన్ హబ్‌తో పాటు మెట్రో, అతిపెద్ద బస్ టర్మినల్ కూడా నిర్మించబోతున్నాం” అని తెలిపారు.